క్రైమ్/లీగల్

ఆటో ఢీ.. వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మఘట్ట, మార్చి 5 : మండలంలోని రంగసముద్రం గ్రామ సమీపంలో మంగళవారం ఆటో ఢీకొనడంతో ఆర్.కొత్తపల్లికి చెందిన మాల మారెప్ప(52) మృతి చెందాడు. ఏఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మారెప్ప కొత్తపల్లి నుంచి ద్విచక్రవాహనంలో రంగ సముద్రం వస్తుండగా మార్గమధ్యంలో కర్నాటక నుంచి లగేజీ ఆటో టాటా ఎస్‌డీ ఢీకొంది. దీంతో మారెప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తిమృతి
అమరాపురం, మార్చి 5 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల పరిధిలోని మద్దనకుంట క్రాస్ సమీపంలో అమరాపురం గ్రామానికి చెందిన నాగరాజు (48) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమరాపురానికి చెందిన నాగరాజు కర్నాటకలోని శిర సమీపంలోని లక్కనహళ్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యేక తరగతులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో భార్య కవితతోపాటు గ్రామానికి వస్తుండగా మద్దనకుంట క్రాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాగరాజు తీవ్ర గ్రాయాలకు గురయ్యాడు. భార్య కవితకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే నాగరాజును తుమకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మృతికి అరుణోదయ విద్యాసంస్థ చైర్మన్ మంజునాథ్, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.