క్రైమ్/లీగల్

కాలువలో పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, మార్చి 5 : మండలంలోని చిన్న ముష్టూరు గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలోని పిల్ల కాలువలో రంజిత్ (7) ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన బోయ నాగరాజు కుమారుడు బోయ రంజిత్ స్థానిక యూపీ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. రంజిత్, అతని స్నేహితుడు కలసి కాలువలో ఈతకు వెళ్లారు. ఈనేపథ్యంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కొట్టుకుపోయి మృతి చెందాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.