క్రైమ్/లీగల్

విశాఖ బీచ్‌లో సముద్ర స్నానాలు: యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 5: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖలో సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. అలాగే సముద్రంలో స్నానాలు చేసే క్రమంలో ఆరుగురు వ్యక్తులు ఫిషింగ్ హార్బర్ జెట్టీ వద్ద సముద్రంలోకి దిగారు. వీరిలో ఒకరు గల్లంతయ్యారు. మహాశివరాత్రి పుణ్య స్నానాల కోసం పెదజాలరి పేట బాపూజీ నగర్‌కు చెందిన వీ సత్యసాయి ప్రసన్న (30) వైఎంసీఏ వద్ద సముద్రంలో దిగాడు. కెరటాలు బలంగా ప్రసన్నను లోనికి తీసుకుపోయాయి. రక్షించేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. కొద్ది సేపటికి స్థానికులు ప్రసన్న మృత దేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతుని బంధువుల రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే విశాఖ ఫిషింగ్ హార్బర్ జెట్టీ నెంబర్ 11 వద్దకు కంచరపాలెం సమీపంలోని బర్మా కేంపునకు చెందిన ఆరుగురు వ్యక్తులు పుణ్య స్నాలకు వచ్చారు. వీరిలో ముగ్గురు యువకులు పతివాడ ప్రవీణ్‌కుమార్ (18), సిరికి సుధీర్ (18), దానాల చరణ్ (15) స్నానానికి జెట్టీలోకి దిగారు. ఇద్దరు యువకులు ఒడ్డున సురక్షిత ప్రాంతంలో ఉండగా, ప్రవీణ్‌కుమార్ కొంత ముందుకు వెళ్లాడు. కెరటాల ఉధృతి పెరగడంతో ప్రవీణ్ మునిగిపోయాడు. గజఈతగాళ్లు, పోలీసులు ప్రవీణ్ కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.