క్రైమ్/లీగల్

నీటి అక్రమ కనెక్షన్ తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: జలమండలి సరఫరా చేస్తున్న పైప్‌లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన భవన యాజమానులపై జలమండలి విజిలెన్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాచారం హౌసింగ్ బోర్డు కాలనీలోని సాయి నిలియం అపార్ట్‌మెంట్ యాజమానులు భవనానికి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా తొలగించిన నల్లా కనెక్షన్ స్థానంలో జలమండలి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తిరిగి అక్రమ నీటి కనెక్షన్ తీసుకున్నాడు. ఇది గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ ఆదేశాల మేరకు అక్రమ నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు సంబంధిత భవన యాజమానులు జీవీ రమేష్, పీ.సర్వయ్యతో పాటు మరో ఐదుగురిపై నాచారం పోలీస్టేషన్ ఐపీసీ సెక్షన్లు 269, 430, 379 కింద కేసు నమోదు చేశారు.