క్రైమ్/లీగల్

వంశధార ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: వంశధార ట్రిబ్యునల్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం జస్టిస్ ముకుందం శర్మ నేతృత్వంలోని వంశధార ట్రిబ్యునల్‌లో ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. ఒడిశా తరపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి 106 ఎకరాల భూసేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తగిన సమాచారం రాలేదని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం కూడా ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి.