క్రైమ్/లీగల్

మూడు ఆలయాల్లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, మార్చి 5: వనపర్తి జిల్లా కొత్తకోటలోని ప్రధాన మూడు ఆలయాల్లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్ ఐ రవికాంత్‌రావు తెలిపారు. పట్టణ సమీపంలో ఉన్న వెంకటగిరి ఆలయం, కోట్ల ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా మందిరంలో చోటికి పాల్పడ్డారు.
ఆయా ఆలయాల్లో హుండీలను ఎత్తుకవెళ్లి ఆరుబయట పగులగొట్టి పడేసిపోయారు. కాగా వెంకటగిరి ఆలయంలో సుమారు అరకిలో వెండి శటగోపం, తీర్థం పోసే పాత్రతో పాటు రూ.1000ల నగదు చోరి చేశారు. అలాగే కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3వేల నగదును హుండీని పగులగొట్టి తీసుకవెళ్లారు. సాయిబాబా ఆలయంలో ఉన్న హుండీలో వున్న రూ.500ల నగదును తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఆలయంలోకి తాళాలను పగులగొట్టి హుండీలను ఎత్తుకువెళ్లారు. శివరాత్రి కావడంతో భక్తులు ఆలయాలను దర్శించుకొని హుండీలో ఉన్న కానుకలను సమర్పించుకుంటారనే ఉద్దేశంతో ఈ చోరికి పాల్పడినట్లు తెలుస్తుంది.
కాగా ఇటీవలే ప్రధాన ఆలయాల్లో ఉన్న హుండీలను పగులగొట్టడమే లక్ష్యంగా ఎన్నుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల క్య్లూస్ టీమ్‌లు వచ్చి పరిశీలించారు. ఆయా ఆలయాలను డీ ఎస్పీ సృజన పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చిత్రాలు.. ఆరుబయట సాయిబాబా హుండీ *వివరాలు తెలుసుకుంటున్న డీఎస్పీ సృజన