క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరుతో టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చ 5: టీటీడీ దేవస్థానంతో పాటు యాదగిరి గుట్ట, సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని తార్నాక కేంద్రంగా పెరుమల్ల రమేష్ (28) ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడు. ఈమేరకు మోసపోయిన నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు రమేష్‌ను అరెస్టు చేశారు. టీటీడీ, యాదగిరి గుట్ట, సింగరేణిలో డేటా ఆపరేటర్స్, స్టోర్స్ ఆపరేటర్స్, అటెండర్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని రమేష్ లక్షలు దండుకున్నాడు. కరీంనగర్, బోయినపల్లి, ఉస్మానియా వర్సిటీలో రమేష్‌పై కేసులు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ రాధాకృష్ణ చెప్పారు.