క్రైమ్/లీగల్

బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రూ.1.20 కోట్లు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 5: రైతుల ఆమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి ట్రాక్టర్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి భూ పత్రాలు, ఆధార్ కార్డులు తీసుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఒక కోటి 20 లక్షల రుణాలు పొంది రైతులను మోసగించిన వైనం మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి ట్రాక్టర్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించిన ఘరానా మోసగాళ్లను ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి కథనం ప్రకారం..రైతులకు ట్రాక్టర్ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి భూమి పత్రాలు, ఆధార్ కార్డులు తీసుకొని వారి పేరుమీద ఉన్న వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి కోటి 20 లక్షలు కాజేసిన వారిని పట్టుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బుర్ర తిరుపతి గౌడ్, కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఉంటూ, 2008 నుండి 2014 వరకు మహీంద్ర ట్రాక్టర్ షో రూమ్, ఫోర్స్ మోటర్స్, న్యూ హైల్యాండ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. అక్కడ ఉన్న పరిచయాలతో మోసం చేస్తూ కొంత మంది వ్యక్తులతో ఒక ముఠాగా ఏర్పడి ఫైనాన్స్ కంపెనీలను, బ్యాంకులను, రైతులను నమ్మించి ట్రాక్టర్లను కొన్నవారిని మోసం చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పాతర్లపల్లికి చెందిన కృష్ణ, ఎన్‌టిపిసికి చెందిన ప్రసాద్, మోహన్ రెడ్డి, మోహన్ రావులను తన ముఠాలో సభ్యునిగా చేర్చుకొని ఏజెంట్ల ద్వారా రైతుల పేరు మీద ట్రాక్టర్లు, బ్యాంక్‌ల ద్వారా రుణాలు తీసుకుంటూ రైతులను మోసగించారు. మూడు లక్షల 50 వేల ఒక ట్రాక్టర్ చొప్పున 34 ట్రాక్టర్లు అక్రమంగా విక్రయించి గత రెండేళ్లలో ట్రాక్టర్లపై తీసుకున్న రుణాలు ఎగవేస్తున్నారు. చోల మండలం ఇనె్వస్ట్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌లో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా బుర్ర తిరుపతి గౌడ్ వివిధ ఫైనాన్స్‌లు, బ్యాంకులు, 34 ట్రాక్టర్లు అక్రమంగా రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌లో 16, వరంగల్‌లో 14, సిరిసిల్లలో 1, పెద్దపల్లిలో 1 చొప్పున 34 ట్రాక్టర్లకు గాను కోటి 20 లక్షల నగదు రైతుల పేరు మీద ఉన్న వాటిని తనఖా పెట్టి రుణాలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉపాధి పథకం కింద నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి కూడా భారీగానే కాజేసినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు టాస్క్ఫోర్స్ ఎసిపి శోభన్ కుమార్, సిఐలు శ్రీనివాస రావు, జనార్ధన్ రెడ్డి తదితరులు కృషి చేశారని ఫలితంగా వీరి మోసాలు వెలుగు చూసినట్లు వెల్లడించారు.