క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి ఎస్సై దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, మార్చి 5: నిత్యం విధి నిర్వహణే ప్రాణంగా భావిస్తూ సేవలందిస్తున్న ఎస్సై మధుసూదన్ (35) చివరికి విధి నిర్వాహణకోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారు జామున నల్లగొండలో పోలీస్ ఈవెంట్స్ కార్యక్రమానికి బందోబస్త్‌కు వెళ్తూ తెల్లవారు జామున నాలుగున్నరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ సమీపంలో ఆయన నడుపుతున్న బోలేరో వాహనం (టీఎస్09పీఏ4020) అదుపుతప్పి బోల్తా కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. ఎస్సై స్వగ్రామం తిప్పర్తి మండలం తందుర్తిపల్లి కావడంతో నల్లగొండకు పెద్ద ఎత్తున గ్రామస్థులు చేరుకుని మృతదేహాన్ని చూసి విలపించారు. ఎస్సైకు ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతినిత్యం పోచంపల్లి ప్రజలతో మంచి సంబంధాలు పెంచుకుని విధి నిర్వహిస్తున్న మధుసుధన్ మృతి చెందడంతో పోచంపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి.

చిత్రం.. ఎస్సై మధుసూదన్ మృతదేహం, *ఇన్‌సెట్‌లో ఎస్సై మధుసూదన్ ఫైల్‌ఫొటో