క్రైమ్/లీగల్

ఏటీఎం చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, మార్చి 23 : స్థానిక రావికుంట చెరువు రహదారిలో గుర్తు తెలియని దొంగలు గురువారం రాత్రి ఎస్‌బీఐ ఎటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎంను గడ్డపారతో ధ్వంసం చేసినా ఫలితం లేకపోవడంతో వెళ్లిపోయారు. అంతేగాక పక్కనే ఉన్న కిరాణా కొట్టు షట్టర్ పెకిలించి నగదు పెట్టెలో ఉన్న రూ.14 వేలు ఎత్తుకెళ్ళారు. అనంతరం ఎదురుగా ఉన్న దాదు ఎలక్ట్రికల్ షాపులో కూడా చోరీ చేసేందుకు షట్టర్ తెరవడానికి విఫలయత్నం చేసినట్లు కనిపించింది. శుక్రవారం ఉదయం నగదు కోసం సంబంధిత ఏటీఎంకు వెళ్లిన ఖాతాదారులు ధ్వంసమైన ఏటీఎం కనిపించడంతో పోలీసులు, బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే కిరాణా కొట్టు యజమానికి తెలిపారు. ఎస్సై సుధాకర్‌యాదవ్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నగదు చోరీ కాలేదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఏటీఎం గదిలో అమర్చిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా ఓ యువకుడు గడ్డపారతో ఏటీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యం కనిపించింది. అనంతపురం వచ్చిన క్లూస్ టీం ఏటీఎం, కిరాణా కొట్టులను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. దొంగలు వదిలిపోయిన గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు.

మట్కా కేంద్రంపై పోలీసుల దాడి
ధర్మవరం, మార్చి 23: పట్టణంలో ఎల్‌పీ కూడలిలోని మాట్కా కేంద్రపై పట్టణ పోలీసులు శుక్రవారం దాడి చేసి 8 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి రు.41,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ హరినాథ్ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మట్కాపై పోలీసులు నిఘా ఉంచడంతో శుక్రవారం ఎల్‌పీ కూడలిలో గుట్టుచప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తలమర్ల అన్వర్‌బాషా, సాకే శ్రీనివాసులు, సయ్యద్‌బాషా, ముష్టూరు వెంకటేష్, షేక్ మహమ్మద్ఫ్రీ, గూడు శ్రీరాములు, సయ్యద్ ముస్త్ఫా, కోట రామాంజినేయులును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు.