క్రైమ్/లీగల్

జాతర మిగిల్చిన విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మార్చి 6: మహాశివరాత్రి జాతర విషాధాన్ని మిగిల్చింది. రామతీర్థం జాతరలో బోడికొండపై నుండి జారిపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం సోమవారం రామతీర్థం శివరాత్రి జాతరకు దాసన్నపేటకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారు. వీరు సీతారాంపురం జంక్షన్ వద్ద నుంచి బోడి కొండ మీదకు వెళ్ళే ప్రయత్నంలో జారిపడి ఇద్దరు యువలకు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం ఉదయం స్థానికులు బహిర్భూమికి వెళుతుండగా గాయపడిన వ్యక్తి తారసపడ్డాడు. తరువాత ఇద్దరు మృతదేహాలు కనుగొన్నారు. ఈ ప్రమాదంలో మన్యాల సాయికిరణ్(14), బూర కుమార్(16) వీరిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఐత నాగరాజు తీవ్రగాయాలతో బయపడ్డాడు. కాగా ఈ ముగ్గురు శివరాత్రి రోజున అర్థరాత్రి సమయంలో బోడికొండ ఎక్కే ప్రయత్నంలో జారి పడి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివరాత్రి రోజున దాసన్నపేట ప్రశాంత్ నగర్‌కు చెందిన వీరు స్నేహితులతో అర్థరాత్రి వరకు సరదాగా గడిపి ఒకే బైక్‌మీద వీరు ముగ్గురు రామతీర్థం చేరుకుని సీతారామునిపేట జంక్షన్ వద్ద బైక్‌ను ఉంచి బోడికొండ ఎక్కారు. అదే రోజున ప్రమాదానికి గురై మృతిచెంది ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయలతో బయటపడ్డ వ్యక్తిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో సాయికిరణ్ 9వ తరగతి, కుమార్ 10తరగతి చదువుతున్నారు. మృతులు తల్లిదండ్రులు కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతి చెందిన యువకులు మిస్సయ్యారని విజయనగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారనే సమాచారం. అందివచ్చిన కొడువులు అర్థాంతరంగా తనువు చాలించడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన విద్యార్థులు జాతరకు వెళ్ళి విఘతజీవులుగా మారడం దాసన్నపేటలో విషాధఛాయలు అలుముకున్నాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ నాగరాజును విశాఖ కెజి హెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. ప్రమాద స్థలంలో మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు, స్థానికులు