క్రైమ్/లీగల్

బెల్ట్‌షాప్ నిర్వహకుడిపై కత్తులతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 6: బెల్ట్‌షాప్ నిర్వహకుడిపై కత్తులతో దాడి చేసిన సంఘటన మాదాపూర్‌లో సంచలన సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉవున్నాయి. మాహబూబ్‌నగర్‌కు చెందిన ఆంగోత్ రాములు(36) జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండాలో నివాసముంటున్నాడు. మాదాపూర్‌లోని నిరూస్ జంక్షన్ వద్ద మొదట్లో టీ స్టాల్‌ను నిర్వహించేవాడు. ఈమధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు. డబ్బులు రావడంతో బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఉదయం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కలు ధరించుకుని వచ్చి రాములును ఇంట్లో నుంచి పిలిచి కత్తులతో దాడి చేశారు. రాములు గట్టిగా అరువడంతో నిందితులు తప్పించుకుని పారిపోయారు. రాములు ఛాతీపైన రెండు చేతులకు గాయాలైనాయి. రాములు ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఎస్‌ఐ వెంకట రెడ్డి చెప్పారు. రియల్ ఎస్టేట్ గోడవల లేదంటే ఇతర కారణలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో బెల్ట్‌షాప్‌లు విచ్చలవిడిగా నడుపుతున్న పోలీసులు కనె్నత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.