క్రైమ్/లీగల్

సీరియల్ కిల్లర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 6: కేవలం హత్యలు చేసి వారితో ఉన్న డబ్బును తీసుకెళ్లడానికి కోసం 12హత్యలు చేసిన ఓ నేరగాన్ని ఎట్టకేలకు పోలీసులు ఆరెస్టు చేశారు. బుధవారం నిందితుడిని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి విలేఖరుల ఎదుట హజరుపర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ 12హత్యలు, 4హత్యాయత్నం కేసుల్లో నింధితుడిగా ఉన్న ఎండి యూసుఫ్ అలియాస్ ఇసాక్‌ను వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చౌడాపూర్ దగ్గర మహబూబ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. నింధితుడి కోసం గత కొన్ని రోజులుగా నవాబుపేట పోలీసులతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్ల పోలీసులు ఆచూకీ కోసం వెతుకుతుండగా చౌడాపూర్‌లో పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడ్డ నింధితుడి నుండి 4మోటర్‌సైకిళ్లు, 3సెల్‌ఫోన్లు, రూ.2500లను స్వాధినం చేసుకున్నట్లు వెల్లడించారు. 2003లో డబీర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాహుర్‌ను హత్యచేశాడని, 2006లో షాద్‌నగర్ సమీపంలోనే రెండు హత్యలు చేశాడని, 2012,13లో రెండు హత్యలు, 2015లో ఒకడిని చంపి, 2017లో మరో రెండుహత్యలు చేయగా, 2018లో మరో రెండు హత్యలు చేశాడని, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మరో హత్య నవాబుపేట మండలంలో చేశాడని తెలిపారు. నవాబుపేటలో జరిగిన హత్యకు సంబంధించి కేసు దర్యాప్తు సందర్భంగా నింధితుడిని ఆరెస్టు చేశామని తెలిపారు. 2011, 15 సంవత్సరాల్లో నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. 2017లో జైలుకు కూడా వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ తరచూ హత్యలు చేశాడని తెలిపారు. నింధితుడి స్వగ్రామం రాజాపూర్ మండలం చొక్కంపేట వాసిగా గుర్తించడం జరిగిందన్నారు. ఆయన పలు హత్యల్లో నింధితుడిగా ఉండడంతో గ్రామాన్ని వదిలి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చౌడాపూర్‌లో ఉంటున్నారని తెలిపారు. కేవలం ఎలాంటి పనిచేయకుండా హత్యలు చేసి వారితో ఉన్న డబ్బును దొంగిలించుకునిపోవడమే తప్పా, మరోకటి కాదని నమ్మించి మోసం చేసి గ్రామాలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు మనుషులను తీసుకెళ్లి అక్కడ హత్యచేసి ఆపై వారి దగ్గర సోమ్మును తీసుకెళ్లేవాడని తెలిపారు. నిందితుడిని కోర్టులో హజరుపర్చడం జరుగుతుందని మళ్లీ కస్టడీకి తీసుకోడానికి ఆలోచిస్తున్నామని మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. మరో కేసులో మరో నింధితుడిని ఆరెస్టు చేయడం జరిగింది. గత నెల ఫిబ్రవరి 10వ తేదిన 14వ జాతీయ రహదారిపై బూరెడ్డిపల్లి సమీపంలో మంద అర్జున్ అలియాస్ చంద్రిక అనే హిజ్రా హత్యకు గురైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేయగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భరత్‌లాల్ అనే వ్యక్తి హత్యచేసినట్లు గుర్తించామని వెల్లడించారు. వీపనగండ్ల మండలం తుంకుంట గ్రామానికి చెందిన మంద అర్జున్ కొనే్నళ్లుగా వారి కుటుంబసభ్యులతో కలిసి జడ్చర్ల సమీపంలోని మాచారం గ్రామసమీపంలో నివసిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల ఆర్టిసీ బస్టాండ్ దగ్గర నిల్చున్న హిజ్రా చంద్రికను ఆడపిల్లగా భావించిన భరత్‌లాల్ బలవంతంగా బూరెడ్డిపల్లి వైపు తీసుకెళ్లారు. తీరా హిజ్రాగా కనబడడంతో ఒక్కసారిగా హత్యచేసి పరారు అయ్యాడు. దర్యాప్తు చేయగా భరత్‌లాల్ హత్యచేసినట్లు గుర్తించి ఆరెస్టు చేసి కోర్టులో హజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో డిఎస్పీ భాస్కర్, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. కాగా 12హత్యకేసుల్లో నింధితుడిని పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రెమా రాజేశ్వరి రివార్డులను అందజేశారు.

చిత్రం.. హంతకుడిని ఆరెస్టు చేసి విలేఖరుల ముందు హజరుపర్చిన ఎస్పీ రెమా రాజేశ్వరి