క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో గిరిజనుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, మార్చి 7: మండలంలోని పెద్దగుజ్జువాడ కూడలి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలం గరాలి గ్రామానికి చెందిన జన్ని లక్ష్ముడు(49) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగంలో చక్రతీర్ధ స్నానాలకు వెళ్లేందుకు గాను గరాలి గ్రామం నుండి ఆటోలో మృతుడు లక్ష్ముడుతో పాటు మరికొద్దిమంది వెళ్తున్నారు. బొంతు కూడలి నుండి పొందూరు వైపు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో లక్ష్ముడు మృతి చెందాడు. మృతునకు భార్య లక్ష్మమ్మ, ఇద్దరు ఆడపిల్లలున్నారు. స్థానిక ఏ ఎస్సై ఎమ్ ఆర్‌కె రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా జరిపించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు.