క్రైమ్/లీగల్

సామాజిక కార్యకర్త అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవానీపట్న (ఒడిశా), మార్చి 7: ఒడిశాలోని కలహండి జిల్లాలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారనే ఆరోపణపై ఒక సామాజిక కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. సీఆర్‌పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు ఈ పనులను నిర్వహిస్తున్నారు. లింగరాజ్ బాగ్ అలియాస్ ఆజాద్ అనే వ్యక్తి పనులను అడ్డుకున్నందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసింగ పోలీసు స్టేషన్‌లో కేసును నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ మనోజ్ కుమార్ మహంతా చెప్పారు. నియాంగిరి సురక్ష సమితి అనే ఉద్యమాన్ని నిందితుడునిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో మైనింగ్, పారిశ్రామికీకరణ పనులను అడ్డుకుంటున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. సీఆర్‌పీఎఫ్ క్యాంపు నిర్వహణను అడ్డుకున్నందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. గత నెల 18వ తేదీన నలుగురు సహచరులతో కలిసి నిందితుడు పనులకు ఆటంకం కలిగించారన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని పోలీసవువలు చెప్పారు. గతంలో కూడా నిందితుడు ఈ తరహా చర్యలకు దిగితే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ చెప్పారు.