క్రైమ్/లీగల్

పెస్ట్‌కంట్రోల్‌కు ఇద్దరు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, మార్చి 7: గదిలో కొట్టిన పెస్ట్‌కంట్రోల్(పురుగుల మందు) ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. నగరంలోని ధన్‌కావాడీలో ఈ విషాదం చోటుచేసుకుంది. అజయ్ బెల్డార్(20), అనంత్ ఖేద్కార్(20) నగరంలోని ఓ కాలేజీ కేంటీన్‌లో పనిచేస్తున్నారు. కేంటీన్ మేనేజర్ వారిద్దరికీ సమీపంలోనే ఓ గది ఇచ్చాడు. పని అయిపోగానే గదికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆదివారం రాత్రి గదిలో పెస్ట్‌కంట్రోల్ కొట్టారు. దీంతో అజయ్, అనంత్ స్నేహితుల వద్దకు వెళ్లి రెండ్రోజులు అక్కడే ఉన్నారు. మంగళవారం యథావిధిగా కేంటీన్ పనికి వచ్చారు. రాత్రి పని ముగించుకుని గదికి వచ్చి నిద్రించారు. పెస్ట్‌కంట్రోల్ ప్రభావంతో వారిద్దరూ ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఉదయం విధుల్లోకి రాకపోవడంతో మేనేజర్‌కు ఆరాతీశాడు. వారు ఉంటున్న గదికి వచ్చి తలుపుతట్టినా స్పందన లేదు. దీంతో ఇరుగుపొరువారి సహాయంతో కిటికీ అద్దాలు పగలగొట్టిచూడగా ఇద్దరూ నిర్జీవంగా పడి ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఇది ప్రమాద సంఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు. పెస్ట్‌కంట్రోల్ ఘాటుకే ఇద్దరూ ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేంటీన్ మేనేజర్, పెస్ట్‌కంట్రోల్ చల్లిన వ్యక్తుల నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు.