క్రైమ్/లీగల్

రైలు నుండి జారిపడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, మార్చి 23: రైలు నుండి జారిపడింది...మృత్యువుతో పోరాడింది... చివరకు ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే భీమవరం గ్రామానికి చెందిన యువతి తెల్లవార్లు మృత్యువుతో పోరాడి గాయాలతో బయటపడింది. భీమవరం గ్రామానికి చెందిన జయంతి రాజేశ్వరి (21) గురువారం విజయవాడకు వెళ్లింది. అయితే రాత్రి తిరిగి ఇంటికి తిరుగు ముఖం పట్టింది. గురువారం సాయంత్రం విజయవాడ నుండి బయల్దేరి భీమవరం బయల్దేరింది. అయితే రైలు ఆకివీడు దాటాక గుమ్ములూరు రైల్వేగేటు సమీపానకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు రాజేశ్వరి జారిపడింది. తీవ్రగాయాలతో చంద్రబాబు నగర్ సమీపంలోని బురదలో కూరకుపోయింది. అయితే తెల్లవార్లు ఆ ఊబిలోనే ఉంది. శుక్రవారం తెల్లవారుఝామున ఈ ప్రాంతంలో రైల్వేలైన్లు మరమ్మతుల కోసం వచ్చిన కీమెన్‌లకు 90నెంబర్ మైలు రాయి వద్ద ఊబిలో కూరుకుపోయి కనిపించింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న మిగిలిన గ్యాంగ్‌మెన్‌లతో కలిసి 108కు సమాచారాన్నిచ్చారు. చివరకు రాజేశ్వరిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చివరకు ఆమె వివరాలు తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే రాజేశ్వరి తన తల్లి తండ్రులకు గురువారం రాత్రికి భీమవరం వచ్చేస్తున్నట్లు సమాచారం అందించింది. అయితే రాజేశ్వరి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు భీమవరం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి సీసీ పుటేజి నుండి ఆరా తీశారు. చివరకు రైల్వే పోలీసులు రాజేశ్వరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. రాజేశ్వరి భీమవరం డిఎన్నార్ కళాశాలలో బీఈడీ రెండవ సంవత్సరం చదువుతుంది. రాజేశ్వరి ప్రాణాలతో బయటపడడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.