క్రైమ్/లీగల్

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు, మార్చి 23: తిరువూరు శివారు పీటి కొత్తూరులో శుక్రవారం ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు చెరువులోపడి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం పీటి కొత్తూరు సమీపంలోని దేవసముద్రం చెరువు సమీపంలో రమణ, పావనీల కుమారుడు లోకేష్ (8), నెల్లూరి వెంకయ్య, రమాదేవిల కుమారుడు చక్రవర్తి(10) మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులోపడి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి కూలీపనుల కోసం రమణ పీటి కొత్తూరు వచ్చారు. రమణ కుమారుడు పీటి కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా, చక్రవర్తి తిరువూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతన్నాడు. తిరువూరు సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు వెంకటకుమార్, మోహనరావులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఇంటి వద్ద ఆడుకున్న పిల్లలు విగతజీవులుగా మారటంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా ఉంది.