క్రైమ్/లీగల్

బైక్ దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమూరు, మార్చి 23: జిల్లాలోని పలు గ్రామాల్లో ద్విచక్రవాహనాలు, పొట్టేళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను పెనుమూరు పోలీసులు, ఐడి పార్టీ బృందం శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పాకాల సీఐ రామలింగయ్య కథనం మేరకు వివరాలు. ఐదు నెలలుగా జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, పాకాల, పూతలపట్టు, పెనుమూరు, ఎంఆర్‌పల్లి, కల్లూరు ప్రాంతాల్లోని ఈ 9 మంది దొంగలు పతకం ప్రకారం గ్రామాల్లో సంచరిస్తారు. రాత్రి సమయాల్లో గ్రామాల్లోని వారి ఇళ్ల ఎదుట ఆగివుంచిన ద్విచక్రవాహనాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారై వేరే ప్రాంతాల్లోని గ్రామాల్లో గొర్రెలదొడ్డిపై పడి అక్కడ పొట్టేళ్లను అపహరించి అటవీ ప్రాంతాల్లో వాటిని కోసి మాంసంతోజల్సాలు చేసుకొనేవారు. వీటితో పాటు ద్విచక్రవాహనాలను చోరీ చేసి వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించే వారు వాటితోవచ్చే డబ్బులను ముఠా సభ్యులు పంచుకునేవారు. దొంగల ముఠాలో కొంతమంది పాత నేరస్తులు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో పెనుమూరు మండలం సాతంబాకం పంచాయతీ వడ్డె గుడిసెలకు చెందిన ఆరుగురు, వీరిలో దేవేంద్ర (23), వెంకటేష్ (27), మిట్టూరు నవీన్ (19), యోగేష్ (21), వి.హరి (27), రాజశేఖర్ (26), పూతలపట్టు మండలం తుమ్మలపల్లికి చెందిన తులసీరామ్(23)లతోపాటు మరో ముగ్గురు గురువారం సాయంత్రం సాతంబాకం కె.వడ్డెగుడిసెలలో దేవేంద్ర నివాసంలో సమావేశం అవుతున్నట్లు సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని వీరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.