క్రైమ్/లీగల్

మామను గాయపర్చిన అల్లుడికి మూడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 11: మామను కొరికిన కేసులో అల్లుడికి మూడేళ్ల జైలు, రూ. 26వేలు జరిమానా విధిస్తూ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో బావాజీపేటకు చెందిన నెల్లి అప్పలనాయుడు తన మామ పటమటకు చెందిన లక్ష్మణరావును 2016 నవంబర్ 10న గొడవ పడి చేతి బొటనవ్రేలు కొరికాడు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున పోలీసులు ప్రవేశపెట్టిన 9మంది సాక్షులను విచారించిన మీదట నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.