క్రైమ్/లీగల్

పెద్దటేకూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, మార్చి 23:మండల పరిదిలోని పెద్దటేకూరు గ్రామం సమీపంలో జాతీయ రహదారి-44పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. మండల పరిధిలోని ఉలిందకొండ గ్రామానికి చెందిన రంగారెడ్డి(57) తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనంలో సపోట పండ్లు లోడ్ చేసుకుని కర్నూలుకు బయల్దేరాడు. వెళ్తూ మార్గమధ్యంలో పెద్దటేకూరు గ్రామం వద్ద కూరగాయలు తెచ్చుకునేందుకు మార్కెట్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నిలిచి ఉన్న ఐదుగురిని ఈ వాహనంలో ఎక్కించుకుంటున్నాడు. అంతలోనే డోన్ వైపు నుండి అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో టాటా మ్యాజిక్ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ సంఘటనలో వాహనంలో ఉన్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడగా టాటా మ్యాజిక్ డ్రైవర్ రంగారెడ్డి వాహనంలో ఇరుక్కుని మృతిచెందాడు. అలాగే కింద పడిన వారిలో రసూల్‌బీకి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయి మృతిచెందిన డ్రైవర్‌ను బయటకు తీయించారు. అలాగే గాయపడిన ఐదుగురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ఈ ఘటనపై కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.