క్రైమ్/లీగల్

వైఎస్ అవినాష్‌రెడ్డిని విచారించిన సిట్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 18: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం మాజీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డిని పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ సభ్యులు డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, పోలీసులకు ఎన్ని గంటలకు సమాచారం అందించారు అన్న విషయాలపై ఆరా తీశారన్నారు. హత్య జరిగిన విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించగా వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసి బావ మృతి చెందాడని చెప్పడంతో అక్కడికి వెళ్లినట్లు వివరించానన్నారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకున్నారని అవినాష్‌రెడ్డి వివరించారు.