క్రైమ్/లీగల్

రాజస్థానీ బాలుడి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 25: రాజస్థానీ బాలుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన జగదీష్ చౌదరి నల్లగండ్లలోని తన ప్లైవుడ్ షాపులో పని చేయడానికి అల్లుడు వరుసైన ముఖేష్ (19)ను ఏడు నెలల క్రితం స్వగ్రామం నుంచి తీసుకువచ్చాడు. తన ఇంట్లోనే ఉంటూ దుకాణంలో పని చేస్తుండగా సోమవారం ఉదయం ఆరు గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. బంధువులు, తెలిసిన దుకాణాల యజమానులను సంప్రదించినా ఆచూకీ లభించకపోవడంతో సాయంత్రం చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సలీమ్ దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు 5.3 అంగులాల ఎత్తు ఉంటాడని, ఛామనఛాయ రంగు, కోల ముఖం కలిగి ఉంటాడని ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.