క్రైమ్/లీగల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా, లక్నో, మార్చి 29: గ్రేటర్ నోయిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉండగా, ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జాలన్ జిల్లా నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని జెవార్‌లోని కైలాష్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి గల కచ్చిత కారణం తెలియకపోయినా నెమ్మదిగా వెళ్తున్న ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అతివేగంగా ఢీకొందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మహేష్ కుమార్ (48), హెల్పర్ బంధు (25)తో పాటు ప్రయాణికులు వినీత (32), అరుణ్ (42), అసద్ (12), సుమన్ (35), విశ్వనాథ్ తివారి (75) మృతి చెందారు. అయితే మృతి చెందిన మరో ప్రయాణికుడిని ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు వెంటనే తగిన వైద్యం, ఇతర సహాయం అందజేయాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా మెజిస్ట్రేట్ బీఎన్ సింగ్, పోలీస్ చీఫ్ వైభవ్ కృష్ణ తదితరులు పరామర్శించారు.
కాగా, బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపిన సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి తగిన పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.