క్రైమ్/లీగల్

ఆర్కె-5 గని 17వ లెవల్‌లో కూలిన పైకప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, మార్చి 29: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె-5 గనిలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో కార్మికులకు తీవ్రగాయాలైయాయి. గనిలో 2వ సీం 17వ లెవల్‌లో పైకప్పు బండకూలింది. విధి నిర్వర్థిస్తున్న 12మంది కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. కార్మికుల కథనం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 2వ సీంలో అప్పటి వరకు సమారు 100మంది కార్మికులు రాత్రి బదిలీ విధులు నిర్వహించి గని ఉపరితలంకు వెల్లారు. ఎస్‌డీఎల్ ఆపరేటర్ రమేష్ 50టబ్బులు ఫిల్లింగ్ చేసి గని ఉపరి తలంపైకి వెళ్ల్లాడు. అదే సమయంలో రెండవ సీంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రాన్సిస్ పనుల నిమిత్తం ఫ్రీ షిఫ్ట్‌లో 12 మంది కార్మికులు ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ లక్ష్మణ్, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, ఎలక్ట్రీషియన్ నెల్కి మల్లేష్‌ల అధ్వర్యంలో అక్కడికి చేరుకుని విధులు నిర్వర్తిస్త్తుండగా అదే సమయంలో గనిపై కప్పు సుమారు 20 మీటర్ల వరకు పెద్ద ఎత్తున కూలుతున్న సిగ్నల్స్ రావడంతో హెండార్ కార్మికుడు కాన్యూరి గోపాల్ అక్కడ పని చేస్తున్న 12 మంది కార్మికులను అప్రమత్తం చేశారు. దీంతో ఒకవైపు బండ కూలుతుండగానే ప్రమాదం నుంచి తప్పించుకోవాడానికి పరుగులు తీశారు. కార్మికులు పరుగులు తీస్తున్న క్రమంలో బండ పడుతున్న గాలికి కార్మికులపై రూఫ్ బోల్టులు, టింబర్ తుంటలు ఇతర బొగ్గు పెళ్లలు, మెటీరియల్ పెద్ద ఎత్తున విరిగి పడటంతో తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ లక్ష్మణ్, మల్లేష్ హాలర్ ఆపరేటర్ మొగిలి ట్రామర్ లింగయ్యలకు గాయాలయ్యాయి. మూడవ బదిలీ కార్మికులు విధులు ముగించుకొని వెళుతున్న క్రమంలో ఈ ప్రమాద సంఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. నైట్ షిప్ట్ కార్మికులు విధినిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగుంటే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రమాదంలో చిక్కుకునే వారని కార్మికు ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే గాయపడిన వారిని గని ఉపరితలానికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఆర్కె-5 గ్రూప్ ఏజంట్ శ్రీనివాస్ రక్షణాధికారి గుప్తా ఎస్‌వోటు జీఎం పీవీ సత్యనారాయణ, గని మేనేజర్ రాజేందర్‌తోపాటు యూనియన్ నాయకులు సందర్శించారు.