క్రైమ్/లీగల్

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై స్టే ఎత్తివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రదర్శనపై హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందిస్తూ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, సాధారణ పిటిషన్‌గానే భావిస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరఫున పొన్నువోలు సుధాకర్‌రెడ్డి, రమేష్ అల్లంకి కోర్టుకు హాజరయ్యారు.