క్రైమ్/లీగల్

దాడి కేసులో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 1: తాగిన మైకంలో ఓ యువకుడిని చితకబాది తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు యువకులను మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం బొలెరా వాహనం కొన్న వెంకట్‌రెడ్డి స్నేహితులైన తూంకుంట బేసిరెడ్డి, అన్నపురెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిలకు దావత్ ఇచ్చేందుకు ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మి వైన్‌షాపుకు ఆదివారం వచ్చారు. తాగిన తర్వాత మరో రాయల్ స్టాగ్ కావాలని అడిగితే స్టాకు లేదని చెప్పిన యువకుడిపై, పై ముగ్గురు కౌంటర్‌లోకి దూకి అందులో ఉన్న సురేష్, రాముతో పాటు వైన్ షాపు యజమాని పద్మారెడ్డిపై దాడి చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసారు. అయితే తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.