క్రైమ్/లీగల్

ప్రస్తుత విధానమే అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)కు అనుసంధానించిన వీవీ ప్యాట్‌ల (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) స్లిప్పుల లెక్కింపులో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానమే అనుకూలమైనదని కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన ఆఫిడవిట్‌పై అభిప్రాయాలను తెలియజేయాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంలతో పాటుగా 50 శాతం మేర వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు 21 పార్టీల నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై సమాధానం ఇవ్వాలని సీఈసీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఈసీ సమాధానం ఇస్తూ ప్రస్తుతం అవలంబిస్తున్న వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విధానమే అత్యంత అనుకూలమైనదని సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కిస్తే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఆరు రోజులు ఆలస్యంగా వెల్లడించాల్సి వస్తుందని ఈసీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే ఈ పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. సీఈసీ ఇచ్చిన సమాధానంపై తమ అభిప్రాయలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని తదుపరి విచారణను ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది.