క్రైమ్/లీగల్

హార్దిక్‌కు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2015 అల్లర్ల కేసులో దోషిగా పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ హార్దిక్ సుప్రీంను ఆశ్రయించారు. స్టే పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి హార్దిక్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 4న ఆఖరి తేదీ కావడంతో హార్దిక్ పటేల్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. జామ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు గత ఏడాది ఆగస్టులో నిరాకరించింది. సోమవారం హార్దిక్ పటేల్ స్టే కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు దాఖలు చేశారని పటేల్ తరపు న్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అలాగే ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదని బెంచ్ పేర్కొంది. పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మార్చి 12న కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. 2015 నాటి అల్లర్ల కేసులో కోర్టు దోషిగా తేల్చి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దానిపై స్టే కోరుతూ హార్దిక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 29న హార్దిక్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులో ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ జైలుశిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతారు. గుజరాత్ హైకోర్టు తీర్పును హార్దిట్ పటేల్ (25) సోమవారం సుప్రీంలో సవాల్ చేశారు. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘2018 ఆగస్టులో కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడొచ్చి అత్యవసరంగా విచారించాలంటారా?’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పటీదార్ కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లకు సంబంధించి విసానగర్ సెషన్స్ కోర్టు దోషిగా తీర్పునిచ్చింది. 2018 ఆగస్టులో హైకోర్టు తీర్పును నిలిపివేసిందే తప్ప దోషికాదని చెప్పలేదు.