క్రైమ్/లీగల్

మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. పదేళ్లనాటి ఈ కేసును విచారించిన కోర్టు మంగళవారం మోహన్‌బాబుకు జైలు శిక్ష విధించింది. తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై మోహన్‌బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల్లో ఆ మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2009లో సలీమ్ సినిమా సమయంలో ఆ సినిమాకు కావాల్సిన మొత్తం పారితోషికాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించామని, లక్ష్మి ప్రసన్న సొంత బ్యానర్‌తో మరో సినిమా చేయడానికి ఆయనకు రూ.40 లక్షల చెక్ ఇచ్చామన్నారు. సలీమ్ సినిమాకు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో చౌదరితో చేయాల్సిన మరో సినిమాను వద్దనుకున్నామని చెప్పారు. సినిమా చేయడం లేదని చౌదరికి చెప్పామని మోహన్‌బాబు తెలిపారు. చెక్‌ను బ్యాంక్‌లో వేయవద్దని కూడా చెప్పామని, అయినా చౌదరి కావాలనే చెక్‌ను బ్యాంక్‌లో వేసి బౌన్స్ చేశారని మోహన్‌బాబు అన్నారు. తనపై కేసు పెట్టి కోర్టును తప్పుదోవపట్టించారని ఆయన ఆరోపించారు. ఈ తీర్పుపై సెషన్స్ కోర్టులో సవాల్ చేస్తున్నామని అన్నారు.