క్రైమ్/లీగల్

వంద కోట్లు కట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇసుక అక్రమ తవ్వకాలను అదుపు చేయటంలో విఫలమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ వంద కోట్ల జరిమానా విధించింది. ఈ వంద కోట్లను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ గురువారం ఆదేశించింది. పర్యావరణ అనుమతులేవీ తీసుకోకుండానే రాష్ట్రంలో కొనసాగిస్తున్న ఇసుక తవ్వకాలను వెంటనే ఆపాలని కూడా ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక తవ్వకాలు భారీగా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ అనమోలు గాంధీ రాసిన లేఖపై ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. గాంధీ లేఖనే పిటిషున్‌గా తీసుకున్న ఎన్జీటీ ఇసుక తవ్వకాలపై తనిఖీ చేయాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు గతంలో ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే. ఎన్జీటీ ఆదేశం మేరకు రాష్ట్రంలో తనిఖీలు చేసిన మండళ్లు ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తమ నివేదికలో పేర్కొన్నది. ప్రతి రోజు 2,500 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు తమ నివేదికలో పేర్కొన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశానికి విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ పర్యావరణానికి తీరని నష్టం గలిగిస్తున్నారని మండళ్లు ఆందోళన వ్యక్తం చేశాయి. అక్రమంగా ఇసుకను తవ్వుతున్న వారిపై క్రిమినల్ తర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధిత శాఖాధిపతు లందరూ బాధ్యులేనని ఎన్జీటీ స్పష్టం చేసింది.