క్రైమ్/లీగల్

‘ఎన్నికల బాండ్స్’పై మధ్యంతర స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఎన్నికల బాండ్స్ పథకంపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషన్ వేసిన ఎన్జీవోను ఆదేశించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ అవసరమని పేర్కొంటూ, దానిని ఈనెల 10న చేపడతామని కేసు విచారణను వాయిదా వేసింది. అంతకుముందు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్స్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద తరఫున హాజరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఎన్నికల బాండ్స్ పేరిట వేలాది కోట్ల రూపాయలు ఊరూ పేరు లేకుండా రాజకీయ పార్టీలకు చేరుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల బాండ్స్ పేరిట 95 శాతం అధికార పార్టీకే నిధులు చేరుతున్నాయని ఆయన చెప్పారు. అందుకే ఈ బాండ్స్ అమ్మకంపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు వచ్చే నల్లధనం విరాళాలను అరికట్టేందుకే ఎలక్టోరల్ బాండ్స్‌ను కేంద్రం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కాని ఈ విరాళాల్లో 95 శాతం అధికార పార్టీకే వెళ్తున్నాయని ప్రశాంత్ భూషణ్ ఎన్నికల స్పీచ్ ఇస్తున్నారని అన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం ఇది ఎన్నికల సమయమని, అందుకే కేసును ఈనెల 10న విచారణ జరుపుతామంటూ వాయిదా వేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని గత ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సవరణలు చేసిన తర్వాత కార్పొరేట్ విరాళాలు, విదేశీ కంపెనీల విరాళాలు వెల్లువెత్తడానికి గేట్లు ఎత్తేసినట్టయిందని , ఇది భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విపక్షాలు విమర్శించాయి. దీనిపై సీపీఐ (ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు కోర్టులో కేసు వేయగా, కేంద్రం ఎలక్టోరల్ బాండ్లను సమర్థించుకుంది. పైగా దీనివల్ల జవాబుదారీతనం మరింత పెరిగిందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో పారదర్శకతను పెంచేందుకే వీటిని ప్రవేశపెట్టామని, వచ్చే విరాళాలన్నీ ఆయా పార్టీల బ్యాంక్ అకౌంట్లలో పడతాయి కనుక ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని కేంద్రం తెలియజేసింది. కాగా, సెక్షన్ 29ఏ కింద నమోదై, గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లను తెచ్చుకున్న పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల కింద విరాళాలు సేకరించుకునే హక్కును కలిగి ఉంటాయి.