క్రైమ్/లీగల్

రూ.4.92 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పోలీస్ తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు రూ.4.92 కోట్ల రూపాయలు టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అనుసరించి జంటనగరాల్లో నిఘా పెంచామన్నారు. హైదారాబాద్ సిటీలో ఉన్న 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిపిన దాడుల్లో నగదు పట్టుబడినట్లు చెప్పారు. అక్రమంగా నగదును తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న రూ. 9.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం జరుగుతోందన్నారు. దొరికిన డబ్బులు పంజాగుట్ట, ఓయూ, గోల్కొండ, ఎస్‌ఆర్ నగర్‌లో తనిఖీల్లో బయట పడ్డాయన్నారు. ప్రధాన రహదార్ల కూడళ్ళల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజా రవాణాపై నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎన్నికల బందోబస్తులో భాగంగా పోలీసు బలగాలను పెంచామన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మరో మూడు రోజుల్లో పోలింగ్ ఉన్నందున అన్ని జాగ్రతలు తీసుకున్నామన్నారు. పాత బస్తీ ఏరియాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర,రాష్ట్ర బలగాలతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశామన్నారు. హైదరాబాద్‌కు వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పారు. పాత బస్తీ సమస్యాత్మాక ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలించామన్నారు. రానున్న మూడు రోజులు వాహనదారులు తమ ఆధీకృత పత్రాలను చూపించాల్సి ఉంటుందన్నారు. అనుమానితులను అదులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. వందతులు, పుకార్లు ప్రజలు నమ్మొద్దని, ఏదైనా సమాచారం ఉంటే నేరుగా పోలీసులకు చేరవేయాలని ఆయన చెప్పారు.
చిత్రం.. టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు