క్రైమ్/లీగల్

ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 8: మేడిపల్లి గణేష్‌నగర్‌లోని ప్రసాద్ పొలిమేర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. గోదాంలో నుంచి అకస్మాత్తుగా పొగ, మంటలు ఉవ్వెత్తున రావడంతో పరిసర ప్రాంతాల కాలనీల ప్రజలు భయంతో పరుగులు తీశారు. అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి అగ్నిమాపక కేంద్రాలను రప్పించి మంటలను ఆర్పించారు. అప్పటికే అందులో ఉన్న వస్తువులు కాలి బూడిదయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని గోదాం యజమాని ఖయ్యూం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.