క్రైమ్/లీగల్

గోవిందుని కిరీటాల దొంగ దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 8: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఉత్సవ మూర్తులకు సంబంధించిన దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే మూడు బంగారు కిరీటాలను చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. స్వామివారి కిరీటాలను చోరీ చేసిన వ్యక్తి మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోడేగా గుర్తించారు. ఇతనిని దాదర్ రైల్వేస్టేషన్లో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే నిందితుడిని తిరుపతికి తీసుకురానున్న పోలీసులు అతను చోరీ చేసిన మూడు కిరీటాల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. గత ఫిబ్రవరి మూడవ తేదీన తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఉప ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించిన మూడు కిరీటాలు చోరీకి గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. దీనిని సీరియస్‌గా తీసుకున్న తిరుపతి పోలీసులు, టీటీడీ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగానే నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు. ఇందులో అనుమానితులుగా భావిస్తున్నవారిని ఒక్కొక్కరిగా ఎంపిక చేసుకుని వారికి సంబంధించిన సమాచారం సేకరించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో లభించిన చిత్రం ఆధారంగానే మహారాష్ట్ర నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆకాష్ ప్రతాప్ సరోడేను గుర్తించడానికి దాదాపు రెండు నెలలకు పైగా సమయం పట్టింది.
అతనిని దాదర్ రైల్వేస్టేషన్‌లో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతను చోరీ చేసిన బంగారు కిరీటాల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. వాటితోపాటుగా నిందితుడిని కూడా త్వరలో తిరుపతికి తీసుకురానున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.