క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందకుంట, ఏప్రిల్ 8: ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని జమా బందీ చేసేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన ఓ తహశీల్దార్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. బాధిత రైతు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంటకు చెందిన కొత్తూరి సమ్మిరెడ్డి అనే రైతు ఇల్లందకుంట మండలంలోని కొటంగూరి సురేందర్ అనే రైతు వద్ద 1999లో భూమిని కొనుగోలు చేశాడు. భూమిని జమాబందీ చేసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎంపిక కావడంతో రైతు సదరు భూమికి జమాబందీ చేయాలని తహశీల్దార్ రవి రాజ్‌కుమార్‌రావు కోరగా భూమిని జమాబందీ చేసేందుకు రూ. 2 లక్షల లంచం కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారుల పక్కా స్కెచ్ ప్రకారంగా రైతుకు రూ. 2 లక్షల నగదును ఇచ్చి పంపగా రైతు కార్యాలయానికి వెళ్లి వీఆర్‌ఏ రామకృష్ణకు ఇవ్వగా వీఆర్‌ఏ డబ్బులను తీసుకొని తహశీల్దార్ వద్దకు వెళ్తుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి డబ్బును స్వాధీనం చేసుకొని తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు వేణుగోపాల్, రాము, సంజీవ్ విచారణ జరిపి నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.

చిత్రం.. ఏసీబీ అధికారుల అదుపులో ఉన్న తహశీల్దార్ రవి రాజ్‌కుమార్