క్రైమ్/లీగల్

లాలూకు బెయిల్ ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దాణాకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొదని సుప్రీం కోర్టులో సీబీఐ వాదించింది. తీవ్రమైన అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్నందున బెయిల్ మంజూరు చేయొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం లాలూ బెయిల్ పిటిషన్‌ను విచారించింది.‘ఆర్జేడి అధినేతకు బెయిల్ ఇస్తే రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటారు. అలాగే పూర్తిగా దుర్వినియోగం అవుతుంది’అని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన అవినీతి కేసుల్లో ఉన్న లాలూకు ఈ సమయంలో బెయిల్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని దర్యాప్తు సంస్థ కోరింది. కేసుల తీవ్రత దృష్ట్యా ఆర్జేడి అధినేతకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ పదేపదే విజ్ఞప్తి చేసింది. లాలూ బెయిల్ పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు విచారించనుంది. దీనిపై సీబీఐ ధర్మాసనం ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడి నుంచే రాజకీయాలు నెరపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. పేయింగ్ వార్డులో ఉన్న ఆర్జేడి అధినేత సందర్శకులను ఇష్టానుసారం కలవడం, రాజకీయ చర్చలు సాగించడం చేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పేర్కొన్నారు. తాను అస్వస్థతకు గురయ్యాయని చెబుతున్న లాలూ ఆరోగ్యం ఆకస్మాత్తుగా ఎలా కుదుటపడిపోయిందని సీబీఐ ప్రశ్నించింది. ఆరోగ్యం కారణాలు చూపుతూ తరచూ బెయిల్ పిటిషన్లు వేస్తున్నారని వాదించింది. పార్టీ అధ్యక్షుడి హోదాలోనే ఆసుపత్రి నుంచే అన్ని రాజకీయ కార్యకలాపాలు చక్కబెట్టేస్తున్నారని సీబీఐ వివరణ ఇచ్చింది. దాణా కేసులో జైలుశిక్ష పడ్డ లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో పెట్టారు. బెయిల్ పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు మొదలవుతాయి. బెయిల్ కోసం జనవరి 10న జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.