క్రైమ్/లీగల్

మూసారాంబాగ్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఏప్రిల్ 9: రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం షిరిడీ వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉంచిన నగదు, బంగారం చోరీకి గురయ్యాయి. మలక్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూసారంబాగ్‌లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి బాదె సురేష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం షిరిడీ వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి ఇంటి పక్కవైపు తలుపు బోల్టులు తొలగించి తెరిచి ఉండి, లోపలి బీరువాలో వస్తువులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచి ఉంచిన రూ.16లక్షలు నగదు, 30 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో తూర్పు మండల డీసీపీ రమేష్ రెడ్డి, టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్య, మలక్‌పేట ఏసీపీ సుదర్శన్ ఘటనాస్థలిని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలు చోరీ ప్రదేశాన్ని పరీక్షించారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.