క్రైమ్/లీగల్

పట్టుబడ్డ ‘తెలంగాణ వీరప్పన్’ ఎడ్ల శ్రీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని; రెండు దశాబ్దాలుగా అడ్డు అదుపు లేకుండా తెలంగాణ, మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాలను అడ్డా చేసుకుంటూ అక్రమ కలప దందా సాగిస్తున్న తెలంగాణ వీరప్పన్‌గా పిలువబడే మోస్ట్ వాంటెడ్ ఎడ్ల శ్రీను అలియస్ పోతారం శ్రీను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అటవీశాఖ, పోలీస్‌శాఖ, రాజకీయనేతలు అండదండలతోదర్జాగా సాగుతున్న కలప స్మగ్లింగ్ దందాకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు వ్యూహాత్మకంగా చెక్ పెట్టారు. కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనుతో పాటు కోడెదల కిషన్, కోరవేణి మధుకర్, రాగం శ్రీనివాస్, ఎడ్ల సంతోష్ పట్టుబడ్డారు. వీరి నుండి ఏపి 15 ఎ డి 8619 స్కార్పియో, పది టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయత్రం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దందా పూర్వాపరాలు, ఆరెస్ట్ వివరాలను వెల్లడించారు. మంథని డివిజన్ పరిధిలోని పోతారానికి చెందిన ఎడ్లశ్రీను గత 20 సంవత్సరాలుగా అక్రమ కలప దందా సాగిస్తున్నాడని.. ఇతనికి సర్పంచ్ నుండి ఎమ్మేల్యే దాక అండగా నిలిచారని, అదే విధంగా ఈ దందాకు కొంతమంది పోలీసుల సహకారంతో పాటు ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల అండదండలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. కలప స్మగ్లర్ శ్రీనుపై ఇప్పడికే 12 కేసులు నమోదు అయ్యాయని, మరెన్నో కేసుల నుంచి రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసులు కాకుండా చేశాడని తెలిపారు. మంథని రెంజ్‌లో సైతం పలు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. అటవి ప్రాంతాల నుంచి దోంగిలించిన కలపను గోదావరిఖనిలోని సాయిరాం సామిల్స్, శ్రీ బాలాజీ సామిల్స్, ప్రకాశం జిల్లాలోని శనిగ నారాయణరెడ్డి సామిల్‌తో పాటు మరి కొన్ని సామిల్స్‌కు తరలించేవాడని సీపీ పేర్కొన్నారు. కలప స్మగ్లర్ శ్రీను దందా అంతకూడా వ్యూహాత్మకంగా ఒక ముఠాను ఏర్పాటుచేసుకొని, అధేవిధంగా క్షుద్రపూజలు చేసే పూజారుల సహకారంతో కూడా ఈ దందా నడిపిసున్నట్లుగా తమ విచారణలో తెలిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక అటవి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోంటున్నామని, అధునాతమైన టెక్నాలజీతో కలప స్మగర్ల దొంగ దందాలను బయటపెట్టగలిగమని చెబుతూ, అడవులను హరిస్తే ఎవ్వరినైనా.. ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా వదిలిపెట్టేది లేదని, కలప స్మగర్లపై, ఈ దందాకు పూర్తి స్ధాయిలో సహకారం అందించిన వారిపైన సామిల్ నిర్వాహకులపైన కూడా పి.డి యాక్టులు నమోదు చేసి తీరుతామని పోలీస్ కమీషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో డీసీపీ ఆడ్మిన్ అశోక్‌కుమార్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, లా అండ్ అర్డర్ డీసీపీ రవికుమార్, ఎ ఆర్ ఆడిషనల్ డీసీపీ సంజీవ్‌కుమార్, గోదావరిఖని ఉమోందర్‌తో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎడ్ల శ్రీను