క్రైమ్/లీగల్

సుప్రీంలో లాలూకు దక్కని బెయిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. దాణా కేసులో జైలుకెళ్లిన లాలూకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. లాలూ పిటిషన్‌కు బెంచ్ కొట్టేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం లాలూ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ముందురోజే అంటే మంగళవారం ఆర్జేడీ అధినేతకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది. కోట్లాది రూపాయల దాణా కేసులో లా లూకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. బెయిల్ కోసం జనవరి 10న జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డ ఆర్జేడీ నేత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లాలూ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టులో వాదనలు వినిపించారు. లాలూ ఇప్పటికే 24 నెలలు జైలుశిక్ష అనుభవించారని, కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ మాట్లాడుతూ ‘ లాలూకు పడ్డ శిక్షలో 24 నెలలు పెద్ద విషయం కాదు’అని స్పష్టం చేశారు.