క్రైమ్/లీగల్

2013లోనే మూసేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును 2013లోనే మూసివేసినట్టు సుప్రీం కోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. తండ్రీకొడులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రాధమిక విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి దర్యాప్తు సంస్థ శుక్రవారం వౌఖికంగా తెలిపింది. అయితే మొత్తం ఈ వ్యవహారంపై నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐను బెంచ్ ఆదేశించింది. ఎస్పీ అధినేత ములాయం రెండో కుమారుడు ప్రతీక్‌పైనా అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. ఇదే కేసులో రెండు వారాల్లో తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని గత నెల 25న జస్టిస్ సంజీవ్‌ఖన్నాతో కూడిన బెంచ్ ఆదేశించింది.
దర్యాప్తు సంస్థ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ములాయం సింగ్ యాదవ్ రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు నమోదు చేసినట్టు ఆరోపించారు. 2005లో తన కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసిందని, ఆదాయపన్నుశాఖ అధికారులు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని ములాయం తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్త విశ్వనాథ్ చతుర్వేది దురుద్దేశంతోనే తన కుటుంబంపై పిటిషన్ వేశాడని, ఎన్నికల్లో దెబ్బతీయడానికే ఇదంతా జరుగుతోందని ఎస్పీ అధినేత ఆరోపించారు. ములాయం, ఆయన కుమారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను పెండింగ్‌లో ఉన్నాయని చతుర్వేది కోర్టుకు తెలిపారు.