క్రైమ్/లీగల్

పశ్చిమ బెంగాల్‌లో ఏదో జరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ‘పశ్చిమ బెంగాల్‌ను చూస్తుంటే తీవ్ర ఆందోళనకర పరిణామం ఏదో జరుగుతున్నట్టు కన్పిస్తోంది’ అని సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర పరిస్థితులపై వ్యాఖ్యానించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత భార్య లగేజీని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో తనిఖీ చేశారన్న ఆరోపణపై కస్టమ్స్ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న వేధింపులపై దాఖలైన పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కస్టమ్స్ శాఖ తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మార్చి 15న కస్టమ్స్ అధికారులు యధావిధిగా తమ విధులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. టీఎంసీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ భార్య నారూల బెనర్జీ, మరో మహిళ కలిసి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు వచ్చారని, యధాప్రకారం వారి లగేజి సైతం తనిఖీ చేస్తుండగా, వారు అభ్యంతరం తెలిపి కస్టమ్స్ అధికారులను అడ్డుకుని దుర్భాషలాడారని ఆయన చెప్పారు.
తర్వాత వారు వెళ్లిపోయిన కొద్ది సేపటికి రాష్ట్ర పోలీసులు ఎయిర్‌పోర్టు ఆవరణలోకి వచ్చి వారి లగేజీని తనిఖీ చేసినందుకు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించారన్నారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, రాష్ట్రంలోని అరాచక పరిస్థితికి ప్రబల నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దీనిపై కస్టమ్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఇంతవరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దీనిపై సీనియర్ అడ్వకేట్ అభిషేక్ ఎం సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పటిషనర్ రాజ్‌కుమార్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్టు టాక్సెస్ అండ్ కస్టమ్స్ మెంబర్ కావున పిటిషన్ దాఖలు చేసే అర్హతే లేదని పేర్కన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని పిటిషన్ విశ్వసనీయత గురించి తెలుసుకోకున్నా.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా ఉండలేమని పేర్కొంటూ కస్టమ్స్ అధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అంగీకరిస్తున్నట్టు తెలిపింది.