క్రైమ్/లీగల్

మోదీ బయోపిక్ నిషేధంపై 15న సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ను విడుదల చేయకూడదంటూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 15న విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి గోగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ నెల 15న బయోపిక్ నిర్మాతల వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఒక రాజకీయ పార్టీ లేదా వ్యక్తి ప్రయోజనాలను పెంపొందించే ఎలాంటి ప్రదర్శనలను ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయరాదన్న ఉద్దేశ్యంతో మోదీ బయోపిక్ విడుదలపై ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఇసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రధాని మోదీ పేరితో ఉన్న ఈ చిత్రాన్ని తదుపరి ఆదేశాల వరకూ ప్రదర్శించరాదని ఇసీ తెలిపింది. ఈ నెల 10న మోదీ బయోపిక్ విడుదల కావాల్సి ఉండగా, ఆదే రోజున ఇసీ ఆదేశాలు వెలువడ్డాయి. ఎక్కడైతే ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందో రాజకీయ పార్టీల ప్రసార సమానవకాశాలను ధిక్కరించే ఎలాంటి చిత్రాన్ని ప్రదర్శించకూడదని కాంగ్రెస్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఇసీ తెలిపింది. ఇందుకు సంబంధించిన కాపీని సెన్సార్ బోర్డుకు కూడా పంపించింది. ఈ రకమైన బయోపిక్‌ల నిర్మాణం ప్రదర్శన అనేది ఆ రాజకీయ పార్టీకి ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుందని ఇసీ అభిప్రాయపడింది. అయితే ఇది పూర్తిగా సృజనతో కూడినదేనని చెబుతున్నప్పటికీ ఈ చిత్రాన్ని ప్రదర్శించడం వల్ల ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఈ పార్టీలు వాదించాయి. ఇదే అభిప్రాయాన్ని కూడా ఇసీ వ్యక్తం చేసింది. దీని దృష్ట్యానే ఈ చిత్రం విడుదలను నిలిపి వేస్తున్నట్లు తెలిపింది.