క్రైమ్/లీగల్

ఎవరెంత ఇచ్చిందీ చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి వివరాలు, ఎవరు ఇచ్చిందీ దాతల పేర్లు సీల్డ్ కవర్లో ఉంచి తమకు అందజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 30 నాటికి ఎన్నికల కమిషన్‌కు వివరాలు ఇవ్వాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పార్టీలకు అందజేసిన విరాళాలపై పారదర్శకత కోసం సుప్రీం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల బాండ్ల పథకంపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీల బ్యాంక్ ఖాతాలు, విరాళాల వివరాలు, దాతల పేర్లు ఈసీకి అందజేయాలని బెంచ్ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిఫామ్స్ అసోసియేషన్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఎన్నిల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రతిపక్షపార్టీలు స్వాగతించాయి. రాజకీయ విరాళాలపై పారదర్శకతకు వీలుంటుందని పేర్కొన్నాయి. ఎన్నికలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున జోక్యం చేసుకోవద్దంటూ కేంద్రం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్‌ఖన్నాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. చట్టం, ఆదాయపన్ను, ఎన్నికలు, బ్యాంకింగ్ వంటి అనేక అంశాలు ఇందులో ఉన్నందున విచారించాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్లు కొనుగోలుకు ఓ కచ్చితమైన తేది నిర్ణయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను బెంచ్ ఆదేశించింది. ఇలా ఉండగా సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఎన్నికల విరాళాలకు సంబంధించి తమ పార్టీ పూర్తి పారదర్శకత పాటిస్తోందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు బీజేపీ, దాని షూటుబూటు మిత్రులకు మాత్రం మింగుడుపడదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియంకా చతుర్వేది ఎద్దేవా చేశారు. ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం ఆదేశాలు బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ పార్టీకి చెంపపెట్టు అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏ పార్టీకి ఎవరెవరు, ఎంతెంత విరాళం ఇచ్చారో తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందని ఏచూరి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్‌జీవో తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. కాగా దీనిపై కేంద్రం ఇప్పటికే తన విధానాన్ని కోర్టుకు తెలిపిందని, తుది తీర్పుకోసం వేచి చూస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని బీజేపీ అధికార ప్రతినిధి, సుప్రీం కోర్టు న్యాయవాది నళినీ కొహ్లీ వెల్లడించారు.