క్రైమ్/లీగల్

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులకు విధుల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: సుప్రీంకోర్టులో సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టులోనూ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు విధుల విభజన జరిగింది. హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ నేతృత్వంలో ఒక డివిజన్ బెంచ్‌ను, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ , జస్టిస్ పీ కేశవరావుల నేతృత్వంలోని మరో డివిజన్ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్‌లో జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి కూడా ఉంటారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రిట్‌లతో పాటు భూసేకరణ అప్పీళ్లు, ఫ్యామిలీ కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. రెండో డివిజన్ బెంచ్ ఇన్‌కం టాక్స్ అప్పీళ్లను, ఏపీ పునర్విభజన చట్టం కేసులు, సిటీ సివిల్ కోర్టు కేసులు, సుప్రీంకోర్టు లీవ్ పిటీషన్లు, భూ ఆక్రమణ కేసులు పరిశీలిస్తుంది. జస్టిస్ పీవీ సంజీవ్‌కుమార్‌కు బెయిల్ పిటీషన్లు, క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ పిటీషన్లు, రిట్ పిటీషన్లు, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావుకు సివిల్ అడ్మిషన్లు, జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డికి మోటారు ప్రమాదాల కేసులు, జస్టిస్ పీ నవీన్‌రావుకు రెవిన్యూ, అర్బన్ ల్యాండ్ సీలింగ్, భూ సంస్కరణ కేసులు, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్లు, హోం, విద్య, యూనివర్శిటీలు, బీసీ సంక్షేమ శాఖ, ఆరోగ్యం, ఉపాధి, మహిళాభివృద్ధి శాఖలకు సంబంధించిన రిట్ పిటీషన్లను దాఖలు విచారిస్తుంది.
జస్టిస్ చల్లా కోదండరామ్‌కు మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్, ఆహారం, సివిల్ సప్లయిస్, గనులు, రవాణా, దేవాదాయం, ఎక్సైజ్, న్యాయశాఖ, టీటీడీ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, ఆర్‌టీఐ, గృహనిర్మాణం, కంపెనీ కేసులు, జస్టిస్ షమీమ్ అక్తర్‌కు ఫస్టు అప్పీళ్లు, జస్టిస్ పి కేశవరావుకు మోటారు ప్రమాదాల కేసులు తుది విచారణ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ట్రిబ్యునల్స్ రిట్ పిటీషన్లు విచారిస్తారు.
జస్టిస్ టీ అమర్‌నాధ్ గౌడ్ మోటార్ యాక్సిడెంట్ కేసుల అప్పీళ్లను విచారిస్తారు. ఈ మార్పులు ఏప్రిల్ 15 నుండి అమలులోకి వస్తాయి.