క్రైమ్/లీగల్

ఉపాధి కూలీల మృతిపై న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, ఏప్రిల్ 12: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేర్ గ్రామంలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద గ్రామంలోని మట్టి దిబ్బలు మీద పడిన 10మంది ఉపాధికూలీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, కేవీ చంద్రశేఖర్‌రావు అధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఉపాధికూలీలు మృతి చెందిన సంఘటనను ఆయన పరిశీలించారు. ఉపాధిహామీ పథకం పథకంకు సంబంధించిన అధికారులు ఏపీడీ మొగులప్ప, ధన్వాడ మండల ఏపీఎం సిద్దేశ్వర్, తీలేర్ గ్రామ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ విజయభాస్కర్‌లను ఆయన పనులపై విచారణ చేపట్టారు. తీలేర్ గ్రామానికి సంబందించిన ఉపాధిహామీ పనుల రికార్డులను ఆయన పరిశీలించారు. గుట్ట కింద ఉపాధి పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులను జడ్జి అడిగారు. అందుకు ధన్వాడ మండల ఉపాధిహామీ పథకం ఏపీఎం సిద్దేశ్వర్ మాట్లాడుతూ నీటినిలువల కోసం ప్రభుత్వమే ఇట్టి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఉపాధి పనుల వద్ద కూలీలకు ఎండకు టెంట్‌లు వేశారా? లేదా? అని జడ్జి అధికారులను అడిగారు. అందుకు తీలేర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ విజయభాస్కర్ మాట్లాడుతూ పనుల వద్ద టెంట్ వేయలేదన్నారు. అనంతరం జరిగిన సంఘటనపై గ్రామస్తులతో జడ్జి మాట్లాడారు. పనుల వద్ద టెంట్‌లు సక్రమంగా వేయడం లేదన్నారు. ఉపాధి కూలీలకు చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించి నేటికి రెండు నెలలు అవుతుందన్నారు. అనంతరం గ్రామసర్పంచ్ రేవతమ్మ మట్లాడుతూ ఉపాధి పనుల వద్ద కూలీలకు కావల్సిన పలు సౌకర్యాలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంగానే గ్రామంలో 10 మంది ఉపాధికూలీలు మృతి చెందడం జరిగిందన్నారు. ఈవిషయంపై మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన సీనియార్ సివిల్ జడ్జికి విన్నవించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంకు చేరుకున్నారు. ఉపాధి పనులు చేస్తూ ప్రాణాలతో బయటపడిన బి.మణేమ్మను సీనియర్ సివిల్ జడ్జి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ సంఘటన ఎలా జరిగిందని మణెమ్మను జడ్జి అడిగారు. మణెమ్మ మాట్లాడుతూ పనులు చేస్తుండగా గుట్ట కింద ఉన్న 10మందిపై ఒకేసారి మట్టి దిబ్బలు పడడంతో అక్కడికక్కడే వారు చనిపోయారని పేర్కొంది. నేను వారికి దూరంగా కూర్చొని ఉన్నానని దీంతో రాళ్లు కళ్లపై పడటంతో గాయాలు కావడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక విలేఖరులతో సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ తీలేర్ గ్రామంలో ఉపాధికూలీలు 10మంది మృతి చెందిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై హైకోర్టు జడ్జి అదేశాల మేరకు విచారణ చేపడతామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం హైకోర్టు జడ్జికి నివేదికను సమర్పిస్తామని చెప్పారు. సంఘటనకు బాధ్యులపై వారిపై తప్పకుండా చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ విచారణలో జిల్లా ఉపాధిహామీ పథకం ఏపీడీ మొగులప్ప, మరికల్ ఎస్సై జానకీరాంరెడ్డి, ధన్వాడ మండల ఈసీ మోహన్, తీలేర్ గ్రామ సర్పంచ్ కె.రేవతమ్మ హాజరయ్యారు.