క్రైమ్/లీగల్

యువకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 12: పొలంలో మేక మేత మేసిందని ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన బుద్ద నరేశ్(21), అదే గ్రామానికి చెందిన అశోక్ పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నరేశ్ తనకున్న ఎద్దులను, మేకను మేత మేపేందుకు పొలానికి వెళ్లాడు. నరేశ్‌కు చెందిన మేక పక్కనే ఉన్న అశోక్ పొలంలో మేత మేసింది. దీంతో అశోక్ ఆగ్రహించి నరేష్‌పై దాడి చేశాడు. ఇరువురి మధ్య గొడవ ముదరడంతో గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ పెడతానని అశోక్‌కు నరేశ్ హెచ్చరించి ఇంటికి వచ్చాడు. కొంతమంది గ్రామస్థులకు నరేశ్ విషయాన్ని తెలియజేశాడు. అశోక్‌ను గ్రామస్థులు పిలిపించి అడిగే ప్రయత్నం చేశారు. అశోక్, అతని అన్నదమ్ములు వచ్చి నరేశ్‌పై కొడవలి, ఇతర మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. నిందితులు పరారయ్యారు.
నిందితులకు సంబంధించిన ద్విచక్ర వాహనాలకు, ఇంటికి గ్రామస్థులు నిప్పుపెట్టారు. ఏఎస్పీ భాస్కర్ రావు, వికారాబాద్ డీఎస్పీ శిరీష, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ విధించి పోలీస్ పికెటింగ్ పెట్టారు. నరేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నింధితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
షాబాద్, ఏప్రిల్ 12: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన దొండ్ర సంపత్(18) తన అన్న శ్రీనివాస్ (రాము) కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి మారుతీ స్విఫ్ట్ కారులో షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట దగ్గర భవానిమాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరిగి వస్తుండగా షాబాద్ దగ్గరలోని అన్‌మోల్ గార్డెన్ దగ్గర అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. కారులో ఉన్న సంపత్ అక్కడిక్కడే మృతిచెందగా, శ్రీనివాస్, అతని భార్య శే్వత, ఇద్దరు పిల్లలు క్షేత్ర, కుషికి తీవ్రగాయాలైనాయి. నలుగురిని 108 సహాయంతో షాద్‌నగర్‌లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్, కూతురు కుషి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న షాబాద్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పార్టీకి అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు
షాద్‌నగర్, ఏప్రిల్ 12: కష్టకాలంలో ఎవరైతే అంకితభావంతో వెన్నంటి ఉండి పార్టీ అభివృద్ధికి రక్షణగా పనిచేస్తారో వారే నిజమైన నాయకులవుతారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు అన్నారు. శుక్రవారం కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. బక్కని నర్సింలు మాట్లాడుతూ నిజమైన స్నేహానికి పరీక్ష కష్టకాలమని, రాముడితో సుగ్రీవుడు అన్నారని, అలాంటి గొప్ప మాట నేటి యుగంలో చాలా అవసరమని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అంకితభావంతో పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని అన్నారు. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండి పనిచేసిన వారే నిజమైన నాయకులవుతారని పేర్కొన్నారు.
నిజమైన నాయకులకు లాభనష్టాలతో పని లేదని, ప్రజల సౌభాగ్యమే పరమావదిగా భావించి ప్రజా సేవ చేయాలని అన్నారు. టీడీపీ హయంలో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో సమైఖ్య రాష్ట్రం అభివృద్ధి పథం వైపు నడిచిందని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎంతో ప్రగతి సాధించిందని, ప్రజల పక్షాన నిలిచే పార్టీని ఎన్నడూ ఎవరూ ఏమి చేయలేరని అన్నారు. పార్టీ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నాయకుడనేవాడు ప్రజల కోసం బతుకాలని, తమ స్వార్థం కోసం కాదని, ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజల మాటను జవదాటకుండా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. సమావేశంలో ఫరూఖ్‌నగర్ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, కాకునూరు కుమార్, నర్సింలు యాదవ్, రాజశేఖర్ రెడ్డి, గణేష్ గౌడ్, విఠ్యాల అంజయ్య, నారాయణ, మహాలింగం పాల్గొన్నారు.