క్రైమ్/లీగల్

కౌన్సిలర్ కారు ఢీకొని గర్భిణీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 12: గుడివాడ 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్ నండూరి ప్రసాద్ కారు ఢీకొని గర్భిణీ మృతి చెందగా, ఆమె భర్త, కుమార్తె తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. సేకరించిన వివరాల ప్రకారం పెదపారుపూడి మండలం దూళ్ళవానిగూడేనికి చెందిన వ్యవసాయ కూలీ మదిరి రత్నశేఖర్(35), అతని భార్య కల్పన(30), ఏడాదిన్నర వయసున్న కుమార్తె హనన్య గురువారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో హనుమాన్‌జంక్షన్‌కు టీవీఎస్ మోపెడ్‌పై బయలుదేరారు. కల్పన నిండు గర్భిణి. జంక్షన్‌లో కల్పన సోదరికి డెలివరీ అవడంతో చూసేందుకు వెళ్తుండగా ఆరుగొలను సమీపంలో కౌన్సిలర్ నండూరికి చెందిన కారు టీవీఎస్ మోపెడ్‌ను వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రత్నశేఖర్, కల్పన, హనన్యలకు తీవ్రవంగా గాయపడ్డారు. వెంటనే వీరిని గుడివాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కల్పన మృతి చెందింది. రత్నశేఖర్, హనన్యలకు మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ తరలించారు. కల్పన మృతదేహాన్ని శుక్రవారం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి ఆమె బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కారు యజమాని, కౌన్సిలర్ నండూరి వెంటనే రావాలని కల్పన బంధువులు, దూళ్ళవానిగూడెం గ్రామస్థులు మధ్యాహ్నం 2గంటల సమయంలో గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో రాస్తారోకోకు దిగారు. నండూరిని అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు నినాదాలు చేశారు. సాయంత్రం 6గంటల వరకు రాస్తారోకో కొనసాగింది. బాధిత కుటుంబం తరపున పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కల్పన మృతదేహాన్ని పరిశీలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న రత్నశేఖర్, హనన్యలకు నష్టపరిహారం ఇప్పించేందుకు కల్పన కృషి చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు.