క్రైమ్/లీగల్

స్ట్రాంగ్‌రూమ్‌లో ఫొటో దిగిన వ్యక్తిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 13: ఈవీఎంలు భద్రపరిచిన స్రాంగ్‌రూంలో ఫొటోలు దిగిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కీసర గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు నాయకపు వెంకటేశ్ శుక్రవారం భోగారం గ్రామంలోని హోలీమేరీ కళాశాలలో ఏడు నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీఫ్యాట్‌లు భద్రపరిచిన గదుల్లోకి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు వెంకటేశ్‌పై ఐపీసీ 447 సెక్షన్, 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కంటోనె్మంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.