క్రైమ్/లీగల్

కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కనీస వేతన చట్టాలను అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు వేర్వేరు పిల్‌లు దాఖలయ్యాయి. తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి పి జీవన్ రావు, ఏపి స్టేట్ మల్టిపుల్ కాంట్రాక్టర్స్ లేబర్ యూనియర్ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు ఈ పిల్స్‌ను దాఖలు చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి కనీస వేతనాల చట్టాన్ని సవరించాలని, ప్రస్తుత చట్టాన్ని 1948లో రూపొందించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975, 1995లో జీవోలు జారీ అయ్యాయని తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ పి జీవన్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో ఈ విషయమై ఒక మండలిని ఏర్పాటు చేసిందన్నారు. మరో మండలిని 2016లో ఏర్పాటు చేశారన్నారు. ఇంతవరకు రెండు మండళ్లు కలిపి 43 ప్రతిపాదనలు ఇచ్చాయన్నారు. కాని ఈ ప్రతిపాదనలు అమలుకునోచుకోలేదన్నారు.